డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఐదుగురికి జైలు శిక్ష, జరిమానా
17-03-2026 01:49 AM
భిక్కనూర్, మార్చి16 (విజయ క్రాంతి): డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఐదుగురికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి టీ. చంద్రశేఖర్ తీర్పు వెలువరించారు.
భిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపినందుకు అక్కల శరత్ (భిక్కనూర్), శ్రీనివాస్ రావు (ఉప్పల్వాయి), ఆర్. మల్లేశం (భగీర్తిపల్లి), ఓ. చిన్న (చిన్నమల్లారెడ్డి), జి. విజయ్ కుమార్ (భిక్కనూర్) పై కేసులు నమోదు చేశారు. కోర్టు విచారణ అనంతరం న్యాయమూర్తి ఒక్క రోజు జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. ఈ వివరాలను ఎస్‌ఐ డి. అంజనేయులు తెలిపారు.




