1 May, 2026 | 4:00 PM

ముత్యాలగూడెంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

01-05-2026 02:37 PM

రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సర్పంచ్ కల్తీ భద్రయ్య

కారేపల్లి,(విజయక్రాంతి): సింగరేణి మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ముత్యాలగూడెంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆశీస్సులతో ఇందిరమ్మ లబ్ధిదారురాలు రేసు సుజాత తన కొత్త ఇంటిలో గృహప్రవేశం చేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న గ్రామ  సర్పంచ్ కల్తీ భద్రయ్య రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఆశీస్సులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు ఆనందంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పూనం రామ, గ్రామ పంచాయతీ సెక్రెటరీ లోకేశ్వరి, పూనం వెంకటేశ్వర్లు , మాజీ సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్, మాజీ ఉప సర్పంచ్ పూనం సూర్యనారాయణ, కడారి వెంకట్, సీటు మల్లేష్, వీసం అశోక్, పేనక నాగేష్, ముక్తి శీను, కల్తీ విష్ణుమూర్తి తదితరులు