12 April, 2026 | 6:23 AM

నీకెంత ధైర్యం.. అస్సాంను తగులబెడుతావా?

29-08-2024 12:00 AM

గువాహటి, ఆగస్టు 28: అల్లర్లతో బెంగాల్ మండితే ఆ మంటలు అస్సాంతోపాటు ఢిల్లీని కూడా కాల్చేస్తాయన్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరికపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘దీదీ.. అస్సాంకు హెచ్చరించటానికి నీకెంత ధైర్యం? మాపై గుడ్లురిమి చూడకు. మీ రాజకీయ వైఫల్యంతో దేశాన్ని అగ్నిగుండంగా మార్చాలని ప్రయత్నించకు. ఇలాంటి భాష మాట్లాడటం మీకు తగదు’ అని బుధవారం హెచ్చరించారు.