12 April, 2026 | 7:49 AM

జేఎంఎంకు చంపయి సోరెన్ గుడ్‌బై

29-08-2024 12:00 AM
  1. హేమంత్‌తో పార్టీ దిశ తప్పింది 
  2. రాజీనామా లేఖలో మాజీ సీఎం

రాంచీ (జార్ఖండ్), ఆగస్టు 28: అసంతృప్తితో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా కీలక నేత, మాజీ సీఎం చంపయి సోరెన్ తన పార్టీని వీడారు. బీజేపీలో చేరుతానని మంగళవా రం ప్రకటించిన ఆయన బుధవారమే జేఎంఎంకు రాజీనామా చేశారు. సీఎం హేమంత్ సోరెన్ నాయకత్వంలో పార్టీ దిశ తప్పిందని, అందుకే వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. జేఎంఎం నాకు కుటుంబం లాంటిది. ఈ పార్టీని వీడుతానని కలలో కూడా నేనెప్పుడు అనుకోలేదు. కానీ ఇప్పు డు బలవంతంగా వెళ్లాల్సి వస్తోంది ఓ బహిరంగ లేఖ ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు.

సంతాల్ జాతి గౌరవం విషయంలో బీజేపీ మాత్రమే సీరియస్‌గా ఉంద ని, కానీ ఓట్ల కోసం ఇతర పార్టీలు విస్మరిస్తున్నాయని ఆరోపించారు. అందుకే ఆదివా సీల గుర్తింపు, అస్థిత్వాన్ని కాపాడేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలోని బీజేపీలో ఆగస్టు 30న చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.