calender_icon.png 4 February, 2026 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలు ప్రయోజకులు కావాలంటే..

04-02-2026 12:00:00 AM

పాలకుర్తి రామమూర్తి :

అవిద్యా వినయ: పురుష వ్యసనహేతుః

అవినీతోహి వ్యసన దోషాన్న పశ్యతి!

కోపజ: త్రివర్గః, కామజ: చతుర్వర్గః!

- (కౌటిలీయం-8--3)

అన్వీక్షికీ (పదార్ధాల స్వరూపాన్ని ఉపాయాల చేత, హేతువు చేత పరీక్షించే విద్యను అనీక్షికి అంటారు) మొదలైన విద్యలలో వినయాన్ని అనగా శిక్షణను పొందకపోవడం, పురుషుల్లో అనగా మా నవుల్లో వ్యసనాలకు కారణమవుతోంది. వ్యసనశీలి దాని వల్ల కలిగే దోషాలను అ ర్థం చేసుకొనజాలడు, అంటారు ఆచార్య చాణక్య. కోపం వల్ల వాక్పారుష్యం, అర్థ దూషణం, దండపారుష్యం అనబడే మూ డు వ్యసనాలు, కామం వల్ల వేట, జూదం, స్త్రీ/పురుష వాంఛ, మద్యపానము అనబడే నాలుగు వ్యసనాలు కలుగుతాయి, అంటారాయన.

ఈ వ్యసనాలకు బానిస కాకుండా ఉండేందుకు హేతుబద్ధమైన వి ద్యలతో బాటుగా అవసరమైన శిక్షణను స కాలంలో అందించాలి. చిన్నతనంలో అం దించబడిన విద్యయే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. కాబట్టి విద్య/శిక్షణ.. ఏ దైనా వ్యక్తు లకు బాల్యం నుంచే అందించాలి. సాధారణంగా పిల్లలు చెబితే నేర్చుకోరు. పెద్దలను అనుసరించి, అనుకరించి నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం సకారాత్మకంగా ప్రవర్తిస్తూ పిల్లలకు ఆదర్శప్రాయులైతే ఉత్తమ సమాజం ఆవిష్కృతమౌతుంది.

బానిస జీవితం..

సాధారణంగా మన ఆలోచనలే మన ల్ని చాలా ప్రభావితం చేస్తాయి. మన ఆలోచనలు మనసుపై ముద్రలుగా ఏర్పడుతా యి. దానినే ప్రోగ్రామింగ్ అంటాము. ఆ ముద్రలను బట్టి మనలో నమ్మకాలు ఏర్పడుతాయి. నమ్మకాలు మన వైఖరిని నిర్ణయిస్తాయి. వైఖరి మన చేతలకు మూల మౌతుంది. మన చేతలే ఫలితాలను ఆవి ష్కరిస్తాయి. అందువల్ల పిల్లల ఎదుగుదలలోనైనా.. వ్యక్తిగత పురోగతిలోనైనా మన లక్ష్యం లేదా అంతిమ ఫలిత సాధన మన ఆలోచనా సరళిపై ఆధారపడి ఉంటుంది.

సాధించగలను అనే సకారాత్మక వైఖరియే లక్ష్యాన్ని సాధించే దిశలో మనల్ని నడిపిస్తుంది.. అలాగే ఎదుటివారు గౌరవించేం దుకు దోహదపడుతుంది. నిజానికి మన ఆలోచనలు ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుంది అంటారు మానసిక శాస్త్ర జ్ఞులు. మన ఆలోచనలు సక్రమరీతిలో ఉంటే ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం గడపగలుగుతాము. ఎప్పుడూ భయం, అనుమానంతో కూడిన ఆలోచనలతో సతమతమౌతూ ఉంటే మనలో నిర్ణ యం తీ సుకునే శక్తి సన్నగిల్లుతుంది.

క్రమబద్ధమైన ఆలోచనా సరళి లేనివారు ప్రతిదానికీ ఇతరులపై ఆధారపడుతూ బానిస జీవితా న్ని గడుపుతారు. బద్ధకంతో కూడిన ఆలోచ నా సరళి వల్ల మనలో నిజాయితీ లోపిస్తుంది. విద్వేష భావనలతో కూడిన ఆలో చనాపరులు ప్రతి ఒక్కరినీ విమర్శించేందుకు అలవాటుపడతారు. స్వార్థపూరిత ఆలోచనా సరళి సమస్యలకు ఆహ్వానం పలుకుతుంది.

పిల్లల్లో అలవాట్లు..

అలాగే మన ఆలోచనల్లో స్పష్టత, అం దం ఉంటే తదనుగుణమైన అలవాట్లు రూపుదిద్దుకుంటాయి. ఆలోచనల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిర్ణయాత్మక శక్తి కలిగిన వారు, వారి విజయ మార్గాన్ని వారే సృ ష్టించుకోగలుగుతారు. ఆలోచనల్లో ప్రేమ, నిస్వార్ధత ఉన్న వారిలో క్షమాగుణం అధికంగా ఉంటుంది. స్వేచ్ఛ, స్వతంత్రత, స్వ చ్ఛత, పటు త్వం కలిగిన ఆలోచనా సరళి జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రుల ప్రభావం ఎ క్కువగా ఉంటుంది.

పిల్లలు చేసిన ప్రతి పనినీ విమర్శించే వాతావరణంలో పెరిగిన పిల్లలు ప్రతి దానిని ఖండించే మన స్తత్వంతో తయారవుతారు. ఇంటిలో పగ లు, ప్రతీకారం లాంటి వాతావరణం నెలకొంటే పిల్లల్లో పోట్లాడే తత్త్వం ఏర్పడుతుం ది. పిల్లలను అపహాస్యం చేసే తల్లిదండ్రుల పెంపకంలో.. పిల్లల్లో సిగ్గుపడే తత్వం అలవడుతుంది. పిల్లలను పరాభవించే గృహ వాతావరణంలో పిల్లలు అపరాధ భావనను పెంచుకుంటారు. అలాగే ఇంటిలో భద్రతనిచ్చే వాతావరణం నెలకొం టే.. పిల్లల్లో నమ్మకం అధికంగా ఉంటుంది.

కుటుంబసభ్యుల మధ్య మనసులు విప్పి మాట్లాడుకునే విధానం, అవగాహనాపూర్ణ వాతావరణం ఉంటే పిల్లల్లో న్యా యం చేసే గుణం అధికంగా ఉంటుంది. తల్లిదండ్రుల్లో క్షమ, ఓర్పు అధికంగా ఉం టే.. పిల్లలు కూడా క్షమను, ఓర్పును సంతరించుకుంటారు. వా రిలో ఆత్మ విశ్వాసం అధికంగా ఉంటుంది. పిల్లలు చేసిన మంచి పనులను తల్లిదండ్రులు మెచ్చుకుంటే.. ఆ పిల్లల్లో ఇతరుల పట్ల సహాను భూతిని(సానుభూతిని కాదు) ప్రదర్శించే గుణం పెరుగుతుంది.

దుష్పరిణామాలు..

పిల్లల అభ్యుదయాన్ని కోరుకునే తల్లిదండ్రులు.. పిల్లలు మంచి పనులు చేసిన ప్పుడు హృదయ పూర్వకంగా అభినందించాలి. పిల్లలను ఎప్పుడూ ఇతరులతో పోల్చి చూడకూడదు.. ఏదైనా అనునయం తో చెప్పాలి. పిల్లల పట్ల కఠినంగా ఉంటే వారిలో మొండివైఖరి పెరుగుతుంది. మొండిగా వాదించడం, వ్యంగ్యంగా మా ట్లాడడం వల్ల పిల్లలకు తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల గౌరవం పోతుంది. వారు నిరాశావాదాన్ని అలవరచుకుంటారు.

పిల్లల ముందు జీవిత భాగస్వామిని అపహాస్యం చేయడం.. భావావేశాలు ప్రదర్శించడం, ఒ కరితో ఒకరు మాట్లాడకపోవడం, పోట్లాడుకోవడం వల్ల పిల్లల్లో ఆత్మన్యూనత పె రుగుతుంది. ముఖ్యంగా మనలో ఉండే దుర్వ్యసనాలు పిల్లల ముందు ప్రదర్శిస్తే అది తప్పు కాదనే భావన పిల్లల మనసులపై ముద్రితమౌతుంది. పిల్లలను స్నేహి తులుగా ఆదరించడం, కుటుంబ విషయా లు అవసరం మేరకు చర్చించడం, వారి అభిప్రాయా లను గౌరవించడం వల్ల వారి లో తమను గుర్తిస్తున్నారన్న భావన పాదుకుంటుంది.

ముఖ్యంగా పిల్లలు తప్పుదారి లో నడుస్తున్న సమయంలో వారిని తిట్ట డం, నిందించడం కాకుండా ఓపికగా వారి కి ఆ నడత వల్ల జరిగే దుష్పరిణామాలను వివరించడం ఉత్త మం. ‘నీవు తెలివిగలవాడివి.. అర్థం చేసుకోగలవు’ అంటూ మొద లుపెట్టి అనునయంగా చెప్పడం వల్ల ప్ర యోజనం ఉంటుంది. కొన్ని విషయాలు తాము చెప్పలేని స్థితిలో ఆత్మీయులతో లేదా ఉపాధ్యాయులతో చెప్పించాలి.

ఆత్మవిశ్వాసం..

మన కృషిలో లోపం లేకుండా.. ఉత్సా హం, స్ఫూర్తితో నిండిన ఆలోచనలతో ముందడుగు వేసే ప్రతి ఒక్కరి జీవితానికి ప్రకృతి సహజంగానే అభివృద్ధిని ప్రసాదిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఉద్యమించే వ్యక్తి ముందు ఏ శక్తీ నిలువదు. సరైన ఆలోచనా సరళి, విధానంతో, పిల్లలకు సరైన వయసులో అవసరమైన విద్యను, శిక్షణ ను అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల ది, సమాజానిది. అలాంటి విద్యను, శిక్షణను అందుకున్న నాయకుడు.. అభ్యుద యాన్ని సాధించడమే గాక, సహచరులనూ ఉన్నతీకరించేందుకు ప్రయత్నిస్తాడు.