16 July, 2026 | 1:24 PM

ఉచితాలు ఎంతకాలం.. ఉద్యోగాలివ్వండి

11-12-2024 02:06 AM
  • రేషన్ కంటే ఉపాధి ముఖ్యం
  • ఉపాధిపై కేంద్రం దృష్టి పెట్టాలి
  • దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్న కేంద్రం
  • ఉచితాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచిత రేషన్ ఇచ్చే బదులు ఉపాధి కల్పించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉచితాలు ఇవ్వడం సమస్యకు పరిష్కారం కాదని వలసదారులకు ఉపాధి కల్పించాలని సూచించింది. శ్రమ్ పోర్టల్‌లో నమోదైన అందరికీ ఉచిత రేషన్ కల్పించాలని ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీంపై విధంగా వ్యాఖ్యానించింది. పేద ప్రజలకు కేవలం ఆహారం అందజేయడం మాత్రమే కాకుండా ఉపాధి కల్పిం చడం పైన కూడా కేంద్రం దృష్టి పెట్టాలని సూచించింది. 

వాడివేడి వాదనలు..

చర్చ సందర్బంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. న్యాయవాది భూషణ్ ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ వ్యక్తిగత లబ్ధి పొందాలని చూస్తున్నారని తుషార్ మెహతా ఫైర్ అయ్యారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును జనవరి 8 2025కు వాయిదా వేసింది. 

ఇంకెన్ని రోజులు ఇలా..

మహమ్మారి మొదలైనప్పటి నుంచి వలస జీవులకు ఉచిత రేషన్ అందిస్తున్నట్లు ప్రభు త్వం తరఫున సొలిసిటర్ తుషార్ తెలపగా.. ఇంకా ఎన్ని రోజులు ఇలా అని సుప్రీం వారిని ప్రశ్నించింది. వారికి ఉచిత రేషన్ అందించే బదులు వారికి ఏదైనా ఉపాధి కల్పించలేరా? అని అభిప్రాయపడింది. వారి నైపుణ్యాలను మెరుపర్చినా కానీ పరిస్థితి వేరేలా ఉంటుందని తెలిపింది. కొన్ని కారణాల వల్ల ఉచిత రేషన్ ఇంకా 2 నుంచి 3 కోట్ల మందికి అందించలేకపోతున్నట్లు వివరించారు. కేవలం పన్ను చెల్లింపుదారులు మాత్రమే మిగిలిపోయారా అని సుప్రీం ప్రశ్నించింది.