16 July, 2026 | 1:37 PM

ఆనాటి భూకంపానికి కారణాలేంటో?

11-12-2024 02:08 AM

* నేటికీ మిస్టరీనే

* పరిశోధిస్తున్న శాస్త్రవేత్తలు 

* కానీ ఫలితం శూన్యం

* భారీ నష్టం మిగిల్చినపుడమి తల్లి

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: 2011 మార్చి 11  రోజును జపాన్ ఎప్పటికీ మర్చిపోలేదేమో. ఆనాటి భూకంపం జపాన్ వాసులకు తీరని శోకాన్ని మిగిల్చింది. 9.1 తీవ్రతతో వచ్చిన భూకం పం ధాటికి జపాన్ అతలాకుతలం అయింది. 30 నిమిషాల వ్యవధిలోనే జపాన్ ఈశాన్య తీరంలో వచ్చిన సునామీ తీవ్ర నష్టాన్ని కలిగించింది. గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపంగా వ్యవహరించే ఆనాటి ఘటనలో 18 వేలకు పైగా ప్రాణాలు బలయ్యా యి. బాధితులు నేటికి కూడా ఆనాటి పీడకలల్ని మర్చిపోలేదు. జపాన్ చరిత్రలోనే అత్యంత పెద్దదైన భూకంపంగా ఆనాటి భూకం పం చరిత్రకె క్కింది. 1900 సంత్సరం నుంచి చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద భూకంపం అది. కానీ ఈ భూకంపానికి గల కారణాలు ఇంకా తెలియలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

కారణాలు తెలియదు.. 

ఆనాటి ఘోర విషాదం వెనుక కారణం ఏమిటనేది నేటికి కూడా తెలియరాలేదని శాస్త్రవేత్తల బృందం ప్రతినిధి తెలిపారు. సముద్రంలో డ్రిల్లింగ్ ద్వారా పరిశోధనలు చేపడుతున్నా కానీ కారణాలు తెలియరాలేదు అని వారు పేర్కొన్నారు. ఈ భూకంపానికి గల కారణాలను కనుగొ నేందుకు ప్రయత్నాలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఉష్ణోగ్రతలు పెంచి ప్రయోగాలు కూడా చేస్తూ పరిస్థితులను గమనిస్తున్నారు. బోర్ హోల్స్ నుంచి భౌతిక డేటాను సేకరిస్తూ తేడాలను గమనిస్తున్నారు.