1 July, 2026 | 10:00 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

కోతుల బెడద తగ్గేదెలా?

14-05-2024 12:00 AM

రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాలలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. అవి విపరీతంగా తమ సంతతిని పెంచుకొని నానా రభస చేస్తున్నాయి. ఏటా ఈ వానరాల ధాటికి తట్టుకోలేక ప్రజలు వలసపోతున్న సందర్భాలూ వున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాక కోతుల వీర విహారం సహజమై పోయింది. కొన్ని చోట్లయితే, గుంపులు గుంపులుగా రోడ్ల వెంబడి తిరుగుతూ, దారిన వెళ్ళేవారిని కూడా వదలడం లేదు. పంటపొలాలను పాడు చేస్తూ పళ్లు, కూరగాయలను సుష్టుగా తింటున్నాయి. పొరపాటున ఎవరైనా వాటిని తరుముదామని ప్రయత్నిస్తే వారిమీద పడి కరుస్తాయి. కోతుల దాడిలో కొందరు మృత్యువాత పడిన సందర్భాలూ వున్నాయి. పెంకుటిళ్ల మీది గూనలను పీకి పెడతాయి. 

 కామిడి సతీష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా