విజిలెన్స్ తనిఖీల్లో ధాన్యం నిల్వల్లో భారీ తేడా

16-09-2026 | 11:06am

శివ్వంపేట, సెప్టెంబర్ 15: శివ్వంపేట మండలం గూడూరు శివారులోని ఓం సాయి వెంకటరమణ రైస్‌మిల్లు(Rice mill)లో హైదరాబాద్‌కు చెందిన విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. 2022–23 రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం నిల్వలను పరిశీలించగా 6,026 బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు మెదక్ జిల్లా సివిల్ సప్లైస్ ఇన్‌స్పెక్టర్ తాటి నర్సింలు తెలిపారు.

ఈ కొరతకు సంబంధించి రూ.53,91,606 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ధాన్యం నిల్వలు, రికార్డుల్లో నమోదైన వివరాల మధ్య ఉన్న వ్యత్యాసాలను అధికారులు నమోదు చేసి, తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు