మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ.. వృథాగా తాగునీరు
16-09-2026 | 11:00am
చివ్వెంల, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామంలో మిషన్ భగీరథ(Mission Bhagiratha) పైప్లైన్ లీకేజీతో తాగునీరు భారీగా వృథాగా పోతోంది. అసలే తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో, విలువైన నీరు ఇలా వృథా అవుతున్నా సంబంధిత అధికారుల దృష్టికి లీకేజీ కనిపించడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైప్లైన్ లీకేజీని వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టి తాగునీటి వృథాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.