4 July, 2026 | 10:34 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

అస్సాంలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్

12-07-2024 02:18 AM

రూ.30 కోట్ల విలువైన టాబ్లెట్లు సీజ్

దిస్‌పూర్, జూలై 11 : అస్సాంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. బుధవారం రాత్రి జరిపిన తనిఖీల్లో రూ. 30 కోట్ల విలువైన లక్ష యాబా టాబ్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంగంజ్ ఎస్పీ పార్థ ప్రోతిమ్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని గంధరాజ్‌బరి ప్రాంతంలో బుధవారం రాత్రి యాంటీ నార్కోటిక్స్ జరిపిన ఆకస్మిక దాడుల్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. పక్కా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. లక్ష టాబ్లెట్లను తరలి స్తున్న వాహనాన్ని పట్టుకొని సీజ్ చేశారు. అనంతరం, నజ్ముల్ హుస్సే న్, ముత్లిబ్ అలీ అనే ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.