వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్ నూతన కమిటీ
* సేవల ధరల పెంపుకు నూతన కమిటీ తీర్మానం
వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ నాయీ బ్రాహ్మణ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సముద్రాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా సూత్రం శ్రీనివాస్, ఇన్నారం రమేష్, ప్రధాన కార్యదర్శిగా గడ్డం తిరుపతి, సంయుక్త కార్యదర్శిగా కొత్వల నర్సింహులు, కోశాధికారిగా వెలిశాల శ్రీకాంత్ ఎన్నికయ్యారు.
సలహాదారులుగా సూత్రం రమేష్, కళ్యాణం లక్ష్మణ్, గంగిపల్లి రవి, వెల్దిరాజు, సారం పెళ్లి సంతోష్లను ఎంపిక చేశారు. సమావేశంలో పెరిగిన నిర్వహణ వ్యయాల దృష్ట్యా హెయిర్ కటింగ్, షేవింగ్ తదితర సేవల ధరలను పెంచాలని నిర్ణయించారు. సభ్యుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, వినియోగదారులకు నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్ తెలిపారు.






