తెలంగాణకు భారీగా విదేశీ పెట్టుబడులు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): భారత్‌లో ఈ ఏడాది ఎఫ్‌డీఐ నిధులు భారీగా తగ్గినప్పటికీ, తెలంగాణ వంద శాతానికి మించిన పెట్టుబడులు సాధించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. శనివారం ఈమేరకు ‘ఎక్స్’లో ‘బిజినెస్ లైన్’లో ప్రచురితమైన కథనాన్ని పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా గుజరాత్, తమిళనాడు, తెలంగాణకు మాత్రమే గత ఏడాదికంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి గుజరాత్ 55 శాతం, తమిళనాడు 12 శాతం ఎక్కువ పెట్టుబడులు సాధించాయన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఎఫ్‌డీఐ పెట్టుబడులు తగ్గాయన్నారు. కానీ తెలంగాణ మాత్రం ప్రతికూల పరిస్థితుల్లోనూ 130 శాతం వృద్ధి సాధించిందన్నారు. అమెజాన్ దిగ్గజం వెబ్ సేవల కోసం రూ.36,300 కోట్లు , మైక్రోసాఫ్ట్ దిగ్గజం రూ.16 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడంతోనే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు.






