8 May, 2026 | 3:38 PM

క్రషర్ వ్యాపారం కోసమే పోచారం పార్టీ మార్పు

23-06-2024 01:15 AM

మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి) :  రైతుల కోసం పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరలేదని, క్రషర్ వ్యాపారం కాపాడుకునేందుకు వెళ్లారని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోచారంను కేసీఆర్ ఎంతో గౌరవించారని, దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు.  పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని పేర్కొన్న రేవంత్‌రెడ్డికి ఇప్పుడు ఆ మాటలు గుర్తుకు రావడంలేదా అని ప్రశ్నించారు. బాన్సువాడలో ఉప ఎన్నిక తధ్యమని, ఎప్పడు ఎన్నికల జరిగిన బీఆర్‌ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్ర బాబు, కేసీఆర్‌కు ద్రోహం చేసిన పోచారం త్వరలో రేవంత్‌ను కూడా మోసం చేస్తారని పేర్కొన్నారు.