18 April, 2026 | 2:22 AM

న్యాయం కోసం పోరాటం చేయాలా?

18-04-2026 12:19 AM

పది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పట్టింపు లేదు 

నగరం లో 247, 250 సర్వే నెంబర్లలో న్యాయం చేయాలి

ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత అధికారులకు లేదా!

గత పది రోజులుగా దళిత సంఘాల నిరాహార నేతల దీక్షలు 

మహబూబ్నగర్, ఏఫ్రిల్ 17 (విజయక్రాంతి): ప్రభుత్వ భూములను కాపాడండి మహా ప్రభువు అంటూ ప్రాధేయపడుతున్న అధికార యంత్రాంగం పట్టించుకోకుంటే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ దళిత సంఘాల నేతలు గత పది రోజులుగా జిల్లా కేంద్రంలో నిరాహార దీక్షలు చేపట్టిండ్రు.

ఈ దీక్షలకు మద్దతు రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. ఉద్యోగ సంఘము మరేదో ఇతర సంఘములు నిరసనలు చేస్తున్నాయంటే ఆ సమస్య ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది ప్రత్యేక జీవోలు కావాలి రాష్ట్ర సమస్యగా ఉంది కాబట్టి పరిష్కార రూపం దాల్చినందుకు సమయం పడుతుంది అంటే ఎవరైనా ఆలోచించే మాటే. ప్రభుత్వ భూములే కబ్జాకు గురి అవుతున్నాయి అంటూ దళిత సంఘాల నేతలు ధర్నాలు చేస్తున్న కాపాడాల్సిన అధికార యంత్రం అస్సలు పట్టించుకోకపోవడం వెనుక ఉన్న అంతరిమేమిటో అంత చిక్కడం లేదని వారు వాపోతున్నారు. 

రూ 100 కరెంటు బిల్లు కట్టకుంటే నోటీసులు ఇవ్వకుండానే కరెంటు కట్ చేస్తామని ప్రచారం చేస్తున్న ప్రభుత్వ అధికారులు లక్షల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని చెబుతున్న ఎందుకు పట్టించుకోవడంలేదని వెల్లువెత్తుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందంటూ దళిత సంఘాల నేతలు చెబుతున్న మాట అందరిలో చర్చకు దారితీస్తుంది.

- నిరసనలు పట్టించుకోరు ఎందుకు?

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. ఇక్కడ అన్యాయం జరుగుతుంది. నిరసన తెలుపుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదంటూ అధికార యంత్రంపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండ్రు. నిరసన వ్యక్తం చేస్తూ సమస్య ఉంది అని వినతి పత్రాలు ఇస్తూ చెప్పుతున్న అటువైపే చూడకుంటే ఆ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలంటూ చర్చ ఉప్పందుకు ఉంటుంది. తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అని ప్రత్యేక కోణాల్లో విచారణ చేస్తే ఒకటి రెండు రోజుల్లోనే సమస్య పరిష్కార రూపం దాల్చుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ఎందుకు జరగడం తీసుకోవడం లేదు ఉన్నత అధికారులు సైతం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

- స్పందించే వరకు పోరాటం చేస్తాం...

అధికార యంత్రంగా స్పందించే వరకు పోరాటం చేస్తాం అంటూ దళిత సంఘాల నేతలు స్పష్టం చేస్తుండ్రు. విలువైన భూములను కాపాడుకోకపోవడంలో ప్రభుత్వ అధికారులు విఫలం కావడం విడ్డూరంగా ఉంది అంటూ వారు పేర్కొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఆ భూములు పోకుండా తమ నిరసన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేస్తుండ్రు. నగరం అంత ఈ చర్చ రోజురోజుకు  జటిలంగా మారుతుంది. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.