18 April, 2026 | 2:19 AM

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తాసీల్దార్ వినతి

18-04-2026 12:19 AM

మద్నూర్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి); తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు  శుక్రవారం  డోంగ్లీ మండల ఉపాధ్యాయ ఉద్యోగ జె ఏ సి ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులందరు నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరై, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు.

డోంగ్లీ మండల తహశీల్దార్ కార్యాలయంలో తమ అపరిష్కృత సమస్యలు, పెండింగ్ బిల్లుల చెల్లింపుకై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కార మార్గాలు సూచించాలని తహసిల్దార్ కి మెమోరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పి ఆర్ టి యు రాష్ట్ర, జిల్లా, మండల శాఖ బాధ్యులు, మండల పరిధిలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.