3 August, 2026 | 11:01 AM

గాలివాన బీభత్సం

27-05-2024 01:35 AM

వరుణుడి ప్రకోపానికి 13 మంది మృత్యువాత

నాగర్‌కర్నూల్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో గోడలు కూలి ఎనిమిది మంది 

 పిడుగుపాటుకు ఇద్దరు

వాహనంపై చెట్టు పడి ఇద్దరు..

కారు అద్దం గుచ్చుకుని ఒకరు మృతి

 విజయక్రాంతి నెట్‌వర్క్: వరుణుడు యముడి అవతారమెత్తాడా..? వాయుదేవుడితో కలిసి యమపాశం విసిరి మనుషుల ప్రాణాలను బలిగొన్నాడా? అన్న రీతిలో రాష్ట్రంలో మరణాలు సంభవించాయి. గాలిదుమారంతో కురిసిన వర్షం ఏకంగా 13 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నది. మృతుల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. గోడలు కూలి ఎనిమిది మంది, పిడుగుపాటుకు ఇద్దరు, ద్విచక్రవాహనంపై చెట్టు పడి ఇద్దరు, కారు అద్దం శకలాలు గుచ్చుకుని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.