12 July, 2026 | 2:37 AM

రాధాగాయత్రీ హత్య కేసులో.. భర్త అరెస్ట్

12-07-2026 01:16 AM

డెహ్రాడూన్, జూలై 11: విశాఖ టెకీ రాధా గాయత్రీ కేసులో డెహ్రాడూన్ పోలీసులు ఆమె భర్త శ్రీచరణ్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించడంతో పోలీసులు శ్రీచరణ్, అతని కుటుంబసభ్యులకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరై శ్రీచరణ్‌ను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేసీ పంత్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో హోమ్ స్టేలోని ఆధారాలు, వైద్య నివేదికలు, ప్రాథమిక విచారణలో భర్త శ్రీచరణ్ పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక అసలు కారణాలు ఏంటి? ఇది ఆత్మహత్యా లేదా ప్రణాళిక ప్రకారం హత్య చేశాడా? అన్న కోణంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ ముసోరిలో జూన్ 14న రాధాగాయత్రీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతికి ఆమె భర్త శ్రీచరణే కారణమని రాధాగాయాత్రీ తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి ఆరోపిస్తూ డెహ్రాడూన్‌లో న్యాయపోరాటానికి దిగారు. కాగా ఈ కేసులో జూలై 17న శ్రీచరణ్ తల్లిదండ్రులు విచారణకు రావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు.