భార్య చేతిలో భర్త దారుణ హత్య
10-07-2026 12:00 AM
కోరుట్ల, జూలై 9 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ అయ్యప్పగుట్ట కాలనీలో నివాసం ఉంటున్న కాశీరాం రజని దం పతుల కుటుంబ కలహాలు విషాదానికి దారి తీశాయి ప్రతిరోజూ మద్యం సేవించి వచ్చి భర్త కాశిరాం భార్య రజనీతో గొడవ పడుతుండేవాడని బుధవారం అర్ధరాత్రి భార్యా భర్తల మధ్య జరిగిన గొడవ సహనం కోల్పోయిన భార్య భర్త కాశీరాంను రోకలి బండతో తలపై కొట్టడంతో కాశీరాం అక్కడే మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్టు కోరుట్ల సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి తెలిపారు.






