10 July, 2026 | 2:42 AM

ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన సర్పంచ్

10-07-2026 01:48 AM

నాగిరెడ్డిపేట్, జులై 9 (విజయ క్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో గల ఎంపిపిఎస్ పాఠశాలను గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ మధ్యాహ్నం భోజనం రాగి జావను పరిశీలించి విద్యార్థులకు రాగి జావను తాగిపించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... విద్యార్థులకు బలమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల చదువుకునే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు సమకూర్చిందని విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా మంచి ఆహారాన్ని మంచి విద్యను అందించాలని సూచించారు.

మనము చేసే సేవను, విద్య బోధనను  విద్యార్థులు చూసి ఆకర్షితులై విద్యపై మక్కువ చూపిస్తారన్నారు.  అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి ఇష్టపడతారని సంబంధించిన ఉపాధ్యాయులకు సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ ఉపాధ్యాయుల జ్యోతి, ప్రతిభ  ఉన్నారు.