9 July, 2026 | 7:16 PM

నిర్మల్ పట్టణంలో ఇంటి దొంగ అరెస్ట్

09-07-2026 06:22 PM

నిర్మల్ జులై 9 (విజయక్రాంతి) : నిర్మల్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో 20 రోజుల క్రితం వెంకటరమణ ఇంట్లో చోరీకి పాల్పడ్డ సుమన్ పట్టుకొని అరెస్టు చేసినట్టు డిఎస్పి శ్రీనివాస్ తెలిపారు. వెంకటరమణ కుటుంబ సభ్యులు తీర్థయాత్రలకు వెళ్లడంతో నేరడిగొండకు చెందిన సుమన్ ఇంటి తాళాలు పగలగొట్టి ఏడు తులాల బంగారం నగదులు దోచుకెళ్ళారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదులకు విచారణ జరిపిన పోలీసులు నిందితున్ని గుర్తించి పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని అతని వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ సమ్మయ్య పాన్కి పోలీసులు ఉన్నారు