14 July, 2026 | 11:26 PM

వంట బాగా చేయలేదని భార్యను చంపిన భర్త

01-05-2024 01:12 AM

మేడ్చల్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : వంట బాగా చేయలేదని భార్యను భర్త ఇటుకతో కొట్టి హతమార్చిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకా రం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం లడ్ బాలాఘాట్ జిల్లా పొంగేవాని ప్రాంతానికి చెందిన నవీన్‌దుర్వే, రవీనాదుర్వే (28)లు  కొన్ని సంవత్సరాల క్రితం నగర శివారులోని బాచుపల్లికి వలస వచ్చారు. వీరికి ముగ్గురు కుమారులుండగా పెద్ద కుమారుడు సొంత ఊరిలోనే ఉంటూ 5వ తరగతి చదువుకుంటున్నాడు.

ఇద్దరు చిన్న కుమారులతో స్థానికంగా ప్రగతి కన్‌స్ట్రక్షన్స్‌లో కూలీలుగా పనిచేస్తూ అక్కడే గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే మంగళవారం ఉదయం వంట బాగా చేయ లేదని నవీన్ భార్య రవీనాతో గొడవ పడటంతో మాట మాట పెరిగి ఇటుకతో తలపై కొట్ట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల పోలీసులకు సమాచారం ఇవ్వ డంతో ఘటన స్థలానికి చేరకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. తొటి కార్మికుడి అమర్‌లాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.