మరో ముగ్గురి అరెస్టు
01-05-2024 12:05 AM
అమిత్‌షా నకిలీ వీడియో వ్యవహారంలో..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నకిలీ వీడియోల వ్యవహారంలో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ సైబర్ క్రైం విభాగం పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయగా, అసోం పోలీసులు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అమిత్‌షా నకిలీ వీడియో వ్యాప్తిపై ముంబై బీజేపీ కార్యకర్త ప్రతీక్ కర్పే ఫిర్యాదుతో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంతో పాటు మరో 16 మందిపై పోలీసులు కేసు పెట్టారు.






