16 April, 2026 | 11:54 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

భార్యను హత్య చేసిన భర్త

11-06-2025 12:18 AM

సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

ఎల్బీనగర్, జూన్ 10 : భార్యాభర్తల మధ్య అనుమానం పెనుభూతంగా మారి... ప్రాణాలు తీసే వరకు వచ్చింది. అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన మంగళవారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా, తొండంగి మండలం, కొమ్మనపల్లి గ్రామానికి చెందిన మరి యా దాస్ (35) భార్య అమ్ములు (30) దంపతులు.

వీరికి 2013లో వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమార్తె మహి అశ్విని (11), కుమారుడు, నితిన్ (7) ఉన్నారు. ఈ కుటుంబం ఉపాధి కోసం మూడేండ్ల క్రితం హైదరాబాద్లోని సరూర్ నగర్ డివిజన్ భాగ్యనగర్ కాలనీలో ఉంటున్నారు. దాస్ కారు డ్రైవర్ గా పని చేస్తుండగా, భార్య అమ్ములు ఇండ్లలో పని మనిషిగా పని చేస్తూ జీవిస్తున్నారు. భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరు అక్రమ సంబంధాలపై అనుమానాలు ఉండడంతో తరచుగా గొడవు పడుతున్నారు.

ఈ క్రమంలో 9వ తేదీ రాత్రి 10 గంటల ప్రాం తంలో భార్యాభర్తలు గొడవ పడ్డారు. తిరిగి 10వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో మరియా దాస్, అమ్ములు గొడవ పడ్డారు. అవేశంలో చున్నీతో అమ్ములుని ఊపిరి ఆడకుండా చంపాడు. ఆ తర్వాత మామ అమ్ములు తండ్రి అర్జునకు సమాచారం ఇచ్చాడు. అతను వీరు ఉంటున్న ఇంటి ఎదురుగా ఉంటున్నాడు.

వెంటనే అర్జున కూతురు ఇంటికి వెళ్లగా, మంచంపై తన కుమార్తె విగతజీవిగా పడి ఉన్నది. ఆమె మరణాన్ని నిర్ధారించాడు. అనంతరం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మృతురాలి తండ్రి అర్జున ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదిరెడ్డివివరించారు.