గ్లోబల్ టూరిజంగా హైదరాబాద్
డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దనున్నట్టు పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచే తెలంగాణ ప్రాంతం డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్‌కు కూడా అనువైన ప్రదేశం అని చెప్పారు.
పర్యాటకశాఖ సహకారంతో తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న 3వ సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ బ్రోచర్‌ను మంత్రి జూపల్లి బేగంపేట టూరిజం ప్లాజాలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెడికల్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరి జం, స్పిరిచ్యువల్ టూరిజం సహా వివిధ టూరిజం రంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు వివరించారు.
డెస్టినేషన్ వెడ్డింగ్‌లను ప్రోత్సహించడానికి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వా మ్యంతో (పీపీపీ) పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి, పెట్టుబడిదారులను ఆకర్షిం చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో పర్యాటకాభివృద్ధి తోపాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ అధ్యక్షుడు ఆళ్ల బలరాంబాబు, ప్రధాన కార్యదర్శి రవి బూర మాట్లాడుతూ.. ఈ నెల 14, 15 తేదీల్లో హైటెక్స్‌లో అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళ నం నిర్వహించనున్నట్టు తెలిపారు.
దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్లు, వెడ్డింగ్ డిజైనర్లు, వెడ్డింగ్ స్టులిస్ట్‌లు, డెకరేటర్లు, ఈవెంట్ మేనేజర్లు ఇతర విభాగాలవారు ఈ ఈవెంట్‌లో పాల్గొంటారని చెప్పారు. ఈ ఈవెంట్‌లో 60కిపైగా స్టాళ్లతో గ్రాండ్ ఎక్స్‌పో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీసీఈఐ ఈవెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. కార్యక్ర మంలో పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ ఎండీ రమేశ్‌నాయుడు, పర్యాటకశాఖ డైరెక్టర్ కే నిఖిల, హైటెక్స్ హెడ్ శ్రీకాంత్, ఎస్‌ఐడబ్ల్యూ పీసీ కన్వీనర్ శ్రవణ్, టీసీఈఐ కన్వీనర్ రామ్ కే ముప్పన, కోకన్వీనర్ హరీశ్‌రెడ్డి, కుమార్ రాజా, డాక్టర్ సౌరబ్ సురేఖ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.






