తెలంగాణ అభివృద్ధిలో భాగమవ్వండి
అమెరికాలోని వ్యాపారవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు
గ్లోబల్ ఏఐ సమ్మిట్‌కు ప్రవాసులకు ఆహ్వానం
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యమని ఉద్ఘాటన
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాం తి): తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని అమెరికాలోని వ్యాపారవేత్తలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. గ్రామాల్లో పెట్టు బడులు పెట్టాలని, ఇందుకు తమ ప్రభు త్వం సంపూర్ణ మద్దతును ఇస్తుందని వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే గ్లోబల్ ఏఐ సమ్మిట్‌కు ప్రవాసులు పాల్గొనాలని మంత్రి అహ్వానించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం అట్లాంటాలోని ఆట బిజినెస్ సెమి నార్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు దృక్పథాన్ని ఆయన వివరించారు. ఆవిష్కరణలను ప్రోత్సహించ డం, పరిశ్రమలకు సాధికారత కల్పించడం, అలాగే స్టార్టప్‌లను పెంపొందించడం, శ్రా మిక శక్తి నైపుణ్యాలను మెరు గుతో స్థిరమైన ఐటీ, పారిశ్రామిక అభివృద్ధి జరుగు తుందని పేర్కొన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై కూడా దృష్టి సారిస్తున్నామని మంత్రి చెప్పారు. సెమీకండక్టర్స్, మెడికల్ డివైజ్ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
అన్ని వర్గాల ప్రజల్లో సమ్మిళిత అభివృద్ధిని సా ధించేందుకు విద్య, ఆరోగ్య మౌలిక సదుపా యాల కల్పనకు సంబంధించి మెరుగైన విధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు సెమీ అర్బన్, గ్రామసీమలకు అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేలా పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ను ప్రపంచానికే ఏఐ రాజధానిగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు. అందులో భాగంగానే నగరంలో ఏఐ సిటీ ని ఏర్పాటు చేయబోతున్నామని ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం 200 ఎకరాల ను కేటాయించినట్లు స్పష్టం చేశారు.






