22-02-2026 12:15:07 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : ఫార్మా రాజధానిగా అంతర్జాతీ య స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను హీలింగ్ క్యాపిటల్‌గా తీర్చిది ద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులువేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్ కేర్‌ను...
డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో అనుసంధానించేందుకు చిత్త శుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. లండన్ కేంద్రంగా పనిచేసే ‘ఫ్యూస్’ ఆధ్వర్యంలో ‘ఫ్యూస్ ఏప్యాక్ కనెక్ట్ 2026’ పేరి ట హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సదస్సు లో క్లినికల్ రీసెర్చ్, డేటా సైన్స్ అనుసంధానంపై దేశ, విదేశాల నిపుణులు మేధో మథనం చేశారు. శనివారం ఏర్పాటు చేసిన ఈ కాన్ఫరెన్స్ ముగింపు వేడుకకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హెల్త్ కేర్ భవిష్యత్తు రాబోయే రోజుల్లో క్లినికల్ సైన్స్, ఏఐ, రియల్ వరల్డ్ ఎవిడెన్స్ మేళవింపుపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు.
ము ఖ్యంగా క్లినికల్ రీసెర్చ్‌లో విప్లవాత్మక మార్పులొస్తాయని, టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతుందని చెప్పారు. ఇలాంటి తరుణంలో అందుకు అవసరమైన ఎకో సిస్టంను ఇప్పటి నుంచే తెలం గాణలో అభివృద్ధి చేసేలా దార్శనికతతో కూడిన అడుగులు వేస్తున్నామని తెలిపా రు. అందులో భాగంగానే... ఏఐ సిటీ, యంగ్ ఇండియన్ స్కిల్స్ వర్సిటీ, జీనో మ్ వ్యాలీ విస్తరణ, డేటా మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ర్టంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైలింగ్, మెడికల్ టూ రిజం పాలసీ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్‌కు శ్రీకారం చుట్టామన్నారు.
సైన్స్, డేటా, హ్యూమానిటీ కలిసి పనిచేసినప్పుడే సమాజానికి నిజమైన మేలు జరు గుతుందని తెలిపారు. అందుకోసం పరిశోధకులు, వైద్యులు, సాంకేతిక నిపుణు లు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరముందన్నారు.
నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పరిశోధకులను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో ఫ్యూస్ బోర్డు చైర్మన్ స్టీఫెన్ బాఫోర్డ్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ సర్వేష్ సింగ్, ఐటీ అడ్వైజర్ సాయి కష్ణ తదితరులు పాల్గొన్నారు.