calender_icon.png 22 February, 2026 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్

22-02-2026 12:01:28 AM

క్షేత్రస్థాయి నుంచి క్రీడలను ప్రోత్సాహిద్దాం

ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం: కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి

క్రికెట్ ఫైనల్‌లో విజేతలు తార్నాక జర్నలిస్ట్ టీం తండర్ రన్నర్ ఆఫ్ సనత్ నగర్ టైగర్స్

క్రీడల ప్రోత్సాహంలో ప్రధాని ముందుండి ప్రోత్సహిస్తున్నారు

సికింద్రాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): దేశంలో క్రీడల ప్రోత్సాహంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక చొరవ తీసుకొని ఎంతో ప్రోత్సహాన్ని అందిస్తున్నారని  కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. శనివారం జింఖానా  స్టేడియంలో సికింద్రాబాద్ పార్లమెంట్ సంసద్ ఖేల్ మహోత్సవ్ ఘనంగా ముగిసింది.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అటల్ బిహారి వాజేపేయిఫౌండేషన్ సౌజన్యంతో నెలరోజులుగా సంసద్ ఖేల్ మహోత్సవ్ ఈముగింపు వేడుకల్లో పాల్గొన్న ముఖ్య అతిథి మాజీ గవర్న ర్లు విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, టీచర్ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే చింతల రామ చంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్, పార్టీ ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.

ప్రధానమంత్రి సంసద్ ఖేల్2 క్రికెట్, ఖోఖో,కబడ్డీ పోటీలతో పాటు క్రీడోత్సవాల విజేతలకు సికింద్రాబాద్ జింఖానాగ్రౌండ్ లో బహుమతులను అందచేశారు. నెలరోజుల పాటు ఈ క్రీడోత్సవాలు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో జరిగాయి. కప్పు విజేతలు తార్నాక జర్నలిస్ట్ టీం తండర్..

రన్నర్ ఆఫ్ సనత్ నగర్ టైగర్స్..

ఈసందర్బంగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి  మాట్లాడుతూప్రధానమంత్రి మోదీ దేశవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం లో క్రీడా పోటీలు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. నిర్వహణ పై ఎంపీలను స్వయంగా అడిగి వివరాలు తెలుసుకుంటున్నారని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లో యువతను క్రీడలవైపు దారి చూపిస్తూ ప్రధాని ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. తన వారణాసి నియోజకవర్గ అనుభవాలను కూడా ప్రధాని పంచుకున్నారని తెలిపారు. డిసెంబర్ 3 నుంచి నిర్వహించిన ఈ క్రీడా కార్యక్రమాల్లో సుమారు 35 వేల మంది పాల్గొన్నారని, వచ్చే ఏడాది లక్ష మందికి పైగా భాగస్వామ్యం చేసేలా కృషి చేస్తామని చెప్పారు.

దివ్యాంగులు సౌండ్ ఆధారంగా క్రికెట్ ఆడటం,బస్తీల మహిళలు మ్యూజికల్ చెయర్స్లో పాల్గొనడం విశేషమన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా, యువత శాతం ఎక్కువగా ఉన్న భారత్ క్రీడల్లోనూ అగ్రస్థానానికి చేరాలని ఆకాంక్షించా రు. ఒలింపిక్స్, కామన్వెల్త్, పారా ఒలింపిక్స్లో భారత్ ప్రగతి సాధిస్తున్నదని తెలిపారు. 2030లో ఒలింపిక్స్ భారత్లో నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. క్రీడాకారులకు ప్రధాని స్వయం గా ఫోన్ చేసి ధైర్యం, అభినందనలు తెలియజేస్తున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు.

యువశక్తి దేశ బలం: విద్యాసాగర్‌రావు

మాజీ కేంద్రమంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు  మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన క్రీడా కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా యువత పెద్దఎత్తున పాల్గొంటున్నా రన్నారు. భారత్ అత్యధిక యువశక్తి కలిగిన దేశమని, క్రీడలు నిగ్రహశక్తిని పెంచి దురలవాట్ల నుంచి దూరంగా ఉంచుతాయని చెప్పారు. ఓటమివిజయాలను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. 

యువతకు క్రీడలతో ప్రోత్సాహం

రాంచందర్ రావుపీఎం సంసద్ ఖేల్ 2026 ముగింపు సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు మాట్లాడుతూ సికిం ద్రాబాద్‌లో క్రీడోత్స వాలను విజ య వంతంగా నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి  అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రారంభించిన క్రీడా కార్యక్రమాలతో యువతలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందన్నారు. యువత, మహిళలు, దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయ మని పేర్కొన్నారు.