calender_icon.png 22 February, 2026 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసిబిడ్డను బలిగొన్న పంచాయితీ!

22-02-2026 12:29:00 AM

స్వామి దర్శనం కోసం డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన బీసీ కుటుంబంపై రెడ్డి కులస్థుల దౌర్జన్యం

టెంకాయల దుకాణంలో బంధించి, కులం పేరుతో దూషిస్తూ, 3 గంటల పాటు దాడి

భర్తను వదిలేయాని చంటిబిడ్డతో ప్రాధేయపడిన తల్లి

గాయపడి ఐదు నెలల చిన్నారి మృతి 

బాధితులకు అండగా డీఎస్పీ, బీఎస్పీ రహదారిపై ధర్నా

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో ఘటన

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గట్టు మల్లన్న స్వామి దర్శనం కోసం వెళ్లిన ఓ బీసీ కుటుంబంపై రెడ్డి కులస్తులు చేసిన దౌర్జన్య కాండతో ఐదు నెలల పసిబిడ్డ ప్రాణాలు విడిచింది. దర్శనం కోసం వంద రూపాయలు టికెట్‌ను ఎందుకు కొనాలని ప్రశ్నిం చిన పాపానికి గణేష్ అనే బీసీని టెంకాయల దుకాణంలో బంధించి మూడు గంటల పాటురెడ్డి కులానికి చెందిన నలుగురు దుం డగులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో తన ఒడిలో చంటి బిడ్డతో ఉన్న మహిళ తన భర్తను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో పసిబిడ్డను పోగొ ట్టుకుంది. తన భర్తను వదిలేయాలని బిడ్డతో పాటు కాళ్లపై పడి ప్రాధే పడింది. అయినా కనుకరించకుండా తోసేయడంతో గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఈ ఘటన ఈ నెల 18న చోటు చేసుకోగా అస్వస్థతకు గురై న పసి పాప శనివారం ఉదయం మృతి చెం దింది.

తక్కువ జాతి వారంటూ దూషిస్తూ దాడులకు పాల్పడిన రెడ్డి కులస్తులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు జనరల్ ఆస్పత్రి ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ధర్మ సమాజ్ పార్టీ (డిఎస్పి) వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్, స్థాని క బిఎస్పి నాయకులు రామచందర్, ఇతర ప్రజా సంఘాల నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్, సిపిఎం నాయకులు అశోక్ తదితరులు శనివారం సుమారు నాలుగు గంటల పా టు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. విషయం తెలుసు కున్న డిఎస్పి శ్రీనివాసులు, ఎస్‌ఐలు గోవర్ధన్, గురు స్వామి వారి సిబ్బందితో వచ్చి సముదాయించే ప్రయత్నం చేశారు. 

రెడ్డి నేతలకు కొమ్ముకాస్తున్న పోలీసులు!

ఒక్క బీసీ బిడ్డను బంధించి నలుగురు రెడ్డి కులస్తులు మూకుమ్మడిగా దాడి చేసి మహిళలను అవమానపరుస్తూ ఐదు నెలల పసిబిడ్డ ప్రాణాన్ని బలిగొన్న రెడ్డి నేతలకు స్థానిక పోలీసులు కొమ్ముకాస్తున్నారని విశారదన్ మహరాజ్ ఆరోపించారు. బాధితుల పక్షాన పోరాడుతున్న వారిని షో చేస్తున్నారంటూ పోలీసుల అహంకారపూరిత మా టలను తప్పు పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్డిల దౌర్జన్యం మితిమీరి పోతున్నదని, బీసీలను అణగదొక్కాలని కుట్ర జరుగుతోందని మం డిపడ్డారు. అన్యాయం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా.. రెడ్డి నేతలకే వంత పాడుతూ బీసీలపైనే కేసులు నమోదు చేస్తా రా అంటూ మండిపడ్డారు. కులం పేరుతో దూషించినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని పోలీసులను నిలదీశారు.