కమ్మేసిన మబ్బులు.. కాసేపట్లో భారీ వర్షం
09-06-2024 11:03 AM
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. మరో నాలుగు రోజుల పాటు తెలంగాణతో పాటు కోస్తా ఆంధ్ర, కర్ణాటకల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ ప్రకటించింది. గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో జీహెచ్ ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయం నుంచి నగరంలో వాతావరణం చల్లగా ఉంది.






