31 August, 2026 | 8:40 AM

రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు

09-06-2024 11:15 AM

హైదరాబాద్: ఈనాడు, రామోజీ ఫిల్మ్‌సిటీ వ్యవస్థాపకులు, మీడియా అధినేత రామోజీరావు అంత్యక్రియలు హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో జరుగుతున్నాయి. రామోజీరావు మృతి పట్ల సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. రామోజీరావు అంతిమ సంస్కారాలకు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అంతిమయాత్రలో చంద్రబాబు రామోజీరావు పాడె మోసారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 9, 10 తేదీలను రామోజీరావు సంతాప దినాలుగా ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం తరుఫున ముగ్గురు అధికారులు  రామోజీ అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు.