16 April, 2026 | 7:23 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

గచ్చిబౌలిలోని పబ్‌లో ఎస్ఓటీ పోలీసుల రైడ్స్

14-06-2025 09:50 AM

హైదరాబాద్: నగరంలో డ్రగ్స్, మత్తుపదార్థాల వినియోగం బాగా పెరుగుతోంది. వీటి బారినపడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఓటీ పోలీసులు(SOT Police) శుక్రవారం రాత్రి మదాపూర్, గచ్చిబౌలిలోని పలు పబ్స్ లో తనిఖీలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టర్మినల్ మాల్ లో ఉన్న క్లబ్ రౌగ్, ఫ్రాట్ హౌస్ పబ్స్ లో మెరుపుదాడులు చేసి కొందరికి డ్రగ్స్ టెస్ట్ చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పబ్ లోని డీజే ప్లేయర్ సైతం డ్రగ్స్ పాజిటివ్ రావడంతో పోలీసు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పబ్ ముసుగులో డ్రగ్స్, మత్తు పదార్థాల దందా చేస్తే సహించేదిలేదని, కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఓటీ పోలీసులు హెచ్చరించారు. మే 25వ తేదీన మదాపూర్, గచ్చిబౌలిలోని అకాన్, A19 పబ్ లలో పోలీసులు తనిఖీలు చేసి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. ముఖ్యంగా ఐటీ హబ్ లు అయిన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ లాంటి ఏరియాల్లో డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది.