16 April, 2026 | 9:04 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో పనివాడి ఆత్మహత్య

14-06-2025 11:24 AM

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఇలయ్య ఇంట్లో పని చేసే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. సైదాపురం గ్రామానికి చెందిన గందమల్ల రవి(38) అనే వ్యక్తి తన భార్యతో కలిసి గత కొన్ని ఏళ్లుగా ఎమ్మెల్యే పెంట్ హౌస్‌లో ఉంటు అక్కడే పనిచేస్తున్నాడు. బీర్ల ఐలయ్య నివాసంలోని మూడో అంతస్థులో అనుమానాస్పద స్థితిలో ఆత్యహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న సైదాపురం గ్రామాస్తులు ఎమ్మెల్యే ఇంటికీ చేరుకొని రవిది ఆత్మహత్య అయితే తన సొంత నివాసంలో కాకుండా ఎమ్మెల్యే ఇంట్లో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, రవిని ఇటీవల ఎమ్మెల్యే మందలించాడని,సైదాపురం గ్రామానికి చెందిన రవి ఇటీవలే ఇంటికి వెళ్లి రెండు రోజుల క్రితమే తిరిగి వచ్చినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన తర్వాత ఐలయ్య ఆసుపత్రిని సందర్శించారు. ఇంతలో, రవి మరణంపై సమగ్రమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు జరపాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య డిమాండ్ చేశారు అనేక పరిష్కారాలు లేని ప్రశ్నలను ఉటంకించారు. రవి ఇంత తీవ్రమైన చర్య తీసుకోవడానికి ఎమైయుంటుందని, రాత్రిపూట మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి హడావిడిగా తరలించడం మరిన్ని సందేహాలను లేవనెత్తుతుందని వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మృతుడు రవికి భార్య, ఇద్దురు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.