నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం
05-07-2024 07:10 PM
హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం కురిసింది. మలక్ పేట్, సైదాబాద్, చంపాపేట్, కర్మన్ ఘాట్, సరూర్ నగర్, కొత్తపేట్, చైతన్యపురి, దిల్ సుఖ్ నగర్, తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వదర ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.






