calender_icon.png 11 November, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరకత శివలింగాన్ని దర్శించుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ సతీమణి లావణ్య

11-11-2025 12:19:29 AM

శంకర్పల్లి: నవంబర్ 10:  శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో కార్తీక సోమవారం ఉదయం బ్రహ్మ ముహూర్తమున హైడ్రా కమిషనర్ రంగనాథ్ సతీమణి లావణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు.

ఆలయ నిర్వాహకులు ఆమెను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్తీక సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకు న్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య గౌడ్, ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, కమిటీ సభ్యుడు హన్మంతు, అర్చకులు సాయి శివ, ప్రమోద్, వీరేష్ ఉన్నారు.