calender_icon.png 11 November, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డున పడ్డాను ..న్యాయం చేయండి

11-11-2025 12:21:02 AM

మేడ్చల్, నవంబర్ 10 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో ఉన్న నివాసాన్ని కూల్చివేసి పునాదులు తీశానని, తీరా రద్దు చేయడంతో తనకు ఇల్లు లేకుండా పోయిందని హేమలత అని బాధితురాలు కలెక్టర్ మన చౌదరికి విన్నవించారు. కొర్రెముల శివారులోని ఏకశిల నగరంలో రేకుల షెడ్డులో నివసిస్తుండగా, ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో కూల్చి వేశానని తెలిపారు. పక్క ఫ్లాట్ వారు సర్వే నెంబరు తప్పు ఉందని ఫిర్యాదు చేయడంతో తన ఇల్లును రద్దు చేశారని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరారు.