calender_icon.png 11 November, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదుల పాదయాత్రకు ఎమ్మెల్యే మద్దతు

11-11-2025 12:16:05 AM

అలంపూర్, నవంబర్ 10: న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం అమలు చేయాలని ప్రధాన డిమాండ్ తో న్యాయవాదులు చేపట్టిన పాదయాత్రకు అలంపూర్ శాసనసభ్యులు విజయుడు మద్దతు తెలిపారు. న్యాయవాదులు చేపట్టిన పాదయాత్ర రెండవ రోజు సోమవారం ఎర్రవల్లి వరకు కొనసాగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయవాదుల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవృత్తి గౌరవాన్ని కాపాడేందుకు రక్షణ చట్టం అవసరమని తెలిపారు. ఈ పాదయాత్రలో అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గవ్వల శ్రీనివాసులు, శ్రీధర్ రెడ్డి, నాగరాజు ఆంజనేయులు, యాకోబు, నాయకులు పుల్లూరు పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.