26 June, 2026 | 1:02 AM

నాలాలను పరిశీలించిన హైడ్రా అధికారులు

26-06-2026 12:12 AM

ఘట్ కేసర్, జూన్ 25 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలో హైడ్రాధికారులు గురువారం  పర్యటించారు. వర్షాకాలం నేపథ్యంలో ముంపు ముప్పును తప్పించేందుకు, నాలాల ఆక్రమణలపై నిఘా పెట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టారు. పోచారం డివిజన్ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నాలాలు, కల్వర్టులను అధికారులు నిశితంగా పరిశీలించారు.

జోడిమెట్ల సమీపంలో నాలాను ఆక్రమించి చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి చేసిన ఫిర్యాదుతో స్పందించిన హైడ్రా డి.ఎస్.పి మోహన్ రావు మాజీ చైర్మన్ కొండల్ రెడ్డితో కలిసి నాళాలను పరిశీలించారు.

నాలాలను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన ఎంతటి పెద్ద కట్టడాలనైనా సహించేది లేదన్నారు. నోటీసులు ఇచ్చి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిశీలన అనంతరం నాలాల పునరుద్ధరణకు, ఆక్రమణల తొలగింపునకు హైడ్రా అధికారులు ఒక నివేదికను సిద్ధం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ విశేష్ నాయక్, పోచారం మాజీ ఉపసర్పంచ్ ఆకిటి బాల్ రెడ్డి, నాయకులు జితేందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.