పాస్టర్‌లపై దాడి చేసిన వారిని శిక్షించాలి
-క్రైస్తవ సంఘాల ప్రతినిధుల వినతి
మేడ్చల్, జూన్ 25 (విజయక్రాంతి): మేడ్చల్లో పాస్టర్‌లపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పోలీసులను కోరారు. ఈ మేరకు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో క్రిస్టియన్ అడ్వకేట్ ఫోరం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడ్ చల్ రైల్వే కాలనీ సమీపంలోని ఒలివ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ విలియం కేరి, డేవిడ్ మహేశ్వరం, జాకబ్ పై దాడి చేయడానికి ఖండిస్తున్నామన్నారు. నిందితులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ సత్యనారాయణ హామీ ఇచ్చారని హైకోర్టు అడ్వకేట్ సుధీర్ చాటల, మేడ్చల్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు డేవిడ్ మహేశ్వరం తెలిపారు. క్రైస్తవ ప్రతినిధులు బిషప్ భాస్కర్ ములకల, రాజేశ్వరరావు, కాశీ సతీష్, మృత్యుంజయరావు, జెరూసలెం మత్తయ్య తదితరులు పాల్గొన్నారు.






