15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రకృతికి రుణపడి ఉంటా

06-06-2025 12:00 AM

గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా చెట్టును కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది హీరోయిన్ నభా నటేశ్. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చేసిన ఈ పోస్ట్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్ట్‌తో ప్రకృతి గురించి నభా బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చిందంటూ అందరూ కామెంట్స్ రాస్తున్నారు.

తన సోషల్‌మీడియా పోస్ట్‌లో నభా స్పందిస్తూ.. ‘ఈ రోజు ఒక చెట్టును కౌగిలించుకున్నాను.. ఆ చెట్టు కూడా నన్ను తిరిగి కౌగిలించుకుందనే భావన కలిగింది. ఎంతో అందమైన ఈ ప్రపంచాన్ని చూసేందుకు వచ్చిన అతిథులం మనం. ఇక్కడ ప్రకృతి మనకెన్నో గొప్ప అనుభవాలు ఇస్తోంది. ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని అనుభూతి చెందడం మాత్రమే మనకున్న హక్కు.

ఈ సంతోషాలు ఇచ్చిన ప్రకృతికి రుణపడి ఉంటాను” అని పేర్కొంది. నభా ప్రస్తుతం పలు ఆసక్తికరమైన సినిమాల్లో నటిస్తోంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభు’తోపాటు మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘నాగబంధం’లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్న ఈ రెండు సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవేకాకుండా మరికొన్ని క్రేజీ చిత్రాలు నభా లైనప్‌లో ఉన్నాయి.