11 June, 2026 | 5:10 PM

Breaking News

నేనంటే అసూయగా ఉందన్నాడు!

01-10-2024 03:08 AM

‘రాయన్’ సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ సొంతం చేసుకుంది నటి దుషారా విజయన్. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన సోదరిగా నటించింది దుషార. ఇందులో తన నటనతో సినీప్రియుల మనసు గెలుచుకుందీ భామ. తన తదుపరి చిత్రం ‘వేట్టయన్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుషార.. ధనుష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

“రాయన్’, ‘వేట్టయన్’ సినిమా షూటింగ్స్ ఒకే సమయంలో జరిగాయి. నేను రజనీకాంత్ చిత్రం ‘వేట్టయన్’లో నటిస్తున్నానని తెలిసి ధనుష్ చాలా ఆనందం వ్యక్తం చేశారు. షూటింగ్ స్పాట్‌లో ఓసారి ధనుష్ నా వద్దకు వచ్చి.. ‘రజనీకాంత్ సర్‌తో నటించావా?’ అని అడిగారు. ‘అవును’ అని నేను చెప్పా.

దీంతో ఆయన వెంటనే ‘ఈ విషయంలో నిన్ను చూసి అసూయపడుతున్నా.. ఎందుకంటే ఆయనతో నేనింకా స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయా’ అని చెప్పారు. రజనీకాంత్‌ను ధనుష్ ఎంతలా ఇష్టపడతారో ఆ రోజే నాకు బాగా అర్థమైంది” అని దుషారా చెప్పుకొచ్చింది.

రజనీకాంత్‌పై తనకు ఉన్న అభిమానాన్ని ధనుష్ ఇప్పటికే పలు సందర్భాల్లో తెలియజేశారు. చిన్నతనం నుంచే ఆయన్ను ఆరాధిస్తున్నానని చెప్పారు. ఆయన ఇల్లు చూడటం కోసమే పోయస్ గార్డెన్‌కు వెళ్లేవాడినంటూ సూపర్ స్టార్ పట్ల తనకున్న వీరాభిమానం ఎంతటిదో ఇటీవల ‘రాయన్’ ఈవెంట్‌లోనూ తెలియజేశారాయన.