ఆగస్టు 29న ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్
మెడల్స్, జెర్సీ ఆవిష్కరణ
హైదరాబాద్, జూలై 15 : ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ రన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆగస్టు 29,30 తేదీల్లో జరగనున్న ఈ మారథాన్ రన్‌కు సంబంధించిన జెర్సీ, మెడల్స్‌ను భారత బాక్సర్ నిఖత్ జరీ న్ ఆవిష్కరించింది. హైదరాబాద్ రన్నర్స్ సొ సైటీ, ఎన్‌ఎండీసీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ఈవెంట్‌లో 5కె ఫన్ రన్, ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కె రన్ నిర్వహించ నున్నారు. ఫుల్ మారథాన్ నెక్లెస్ రోడ్ పీపు ల్స్ ప్లాజా దగ్గర ప్రారంభమై బంజారాహి ల్స్, ఐటీ కారిడార్ మీదుగా గచ్చిబౌలీ స్టేడియంలో ముగుస్తుంది.
ఈ ఎడిషన్ వరల్డ్ అథ్లెటిక్స్ ఏబీడబ్ల్యూ సిల్వర్ సాండర్డ్ అందుకున్న భారతదేశపు మొదటి మారథాన్‌గా నిలిచింది. ఈ సారి రికార్డు స్థాయిలో 32 వేల మందికి పైగా రన్నర్లు దీనిలో పాల్గొంటున్నారు. అలాగే విజేతలకు రూ.45 లక్షల ప్రైజడ్‌మనీ అందజేయనున్నారు. వికలాంగుల కోసం అడ్వెంచర్స్ బియాండ్ బారియ ర్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో 300 మందితో ప్రత్యేక రన్ నిర్వహిస్తున్నారు.






