ఆ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను
‘తిమ్మరాజుపల్లి టీవీ’ నటుడు లతీశ్
ఇటీవల విడుదలైన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీతో కిరణ్ అబ్బవరం దాదాపు 50 మంది నటీనటులు, టెక్నీషియన్లను తెర కు పరిచయం చేశారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో సిద్ధయ్య గా కనిపించిన లతీశ్ నటనకు ప్రశంసలు దక్కాయి. తనకు దక్కి న ఈ తొలి విజయం గురించి లతీశ్ విలేకరులతో పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులు ఇవే.. “మాది వ్యవసాయ ఆధారిత నిరుపేద కుటుం బం. ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజులున్నాయి.
మమ్మల్ని మా అమ్మనాన్న, అన్నయ్య కష్టపడి చదివించారు. నేను సినిమాల్లోకి వచ్చానని మా అన్నయ్య నాతో మాట్లాడటం మానేశాడు. ‘తిమ్మరాజుపల్లి టీవీ’లో నా నటన చూసి మాట్లా డాడు. 2017లో హైదరాబాద్ వచ్చి, సినిమా ల్లో నటించాలని ప్రయత్నించినా, ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. కరోనా టైమ్‌లో యూట్యూబ్‌లో ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి యాక్ట్ చేశా. దానికోం చాలా కష్టాలు పడ్డా. నా కమిట్‌మెంట్‌ను చూసి బీ స్టూడియోలో యాక్టింగ్ కోర్స్‌లో ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చారు.
అక్కడే నాటకాలు వేస్తున్నప్పుడు ‘తిమ్మరాజుపల్లి టీవీ’ టీమ్ నన్ను చూసి, నన్ను విలన్ పాత్రకు ఎంపిక చేసుకున్నారు. ఆ పాత్ర కోసం ఏకంగా ముప్పు కిలోలు పెరిగా. సినిమా చూసిన తర్వాత కిరణ్ అబ్బవరం నన్ను ఎంతో ప్రశంసించారు. ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లిన తర్వాత బషీర్ సార్ నా గురించి చెప్పి, నన్ను హగ్ చేసుకున్నారు. ఆ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను. చాలా కథలు వింటున్నా. త్వరలోనే అన్నీ ఓ కొలిక్కి వచ్చేలా ఉన్నాయి” అని తెలిపారు.






