థియేటర్లలో కరతాళ ధ్వనులు!
ధనుష్, మమితా బైజు జంటగా డాక్టర్ ఐషరి కే గణేశ్ నిర్మించిన చిత్రం ‘కర’. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్‌పై సీహెచ్ సతీశ్‌కుమార్, రాజేశ్‌కుమార్ బొబ్బర రిలీజ్ చేశారు. ఈ సినిమా నాలుగు రోజుల్లో సినిమా రూ.4.8 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
వైవిధ్యమైన చిత్రాలతో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న ధనుష్.. ఈ సినిమాలో నటించిన తీరును అభినందిస్తూ ప్రేక్షకులు చేస్తున్న కరతాళ ధ్వనులతో థియేటర్లు మార్మోగుతున్నాయి. మన దేశంలో పంటలు పండించే క్రమంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలెన్నో! అలాంటి ఓ సమస్యను ఇతివృత్తంగా ఈ సినిమాను రూపొందించిన దర్శకుడు వి ఘ్నేశ్ రాజాపై కూడా ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం, నేపథ్య సంగీతం, తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా నిలిచాయి.






