21 May, 2026 | 5:13 PM

హిందీ అర్థం కావట్లేదు

27-10-2024 12:06 AM

కేంద్రమంత్రికి తమిళ ఎంపీ లేఖ

చెన్నై, అక్టోబర్ 26: హిందీ అర్థం కావట్లేదు దయచేసి ఆంగ్లంలో సమాధానం ఇవ్వాలంటూ డీఎంకే ఎంపీ ఎంఎం అబ్దుల్లా  రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్‌సింగ్‌బిట్టుకు శుక్రవారం తమిళంలో లేఖ రాశారు. రైళ్ల లో ఆహారం నాణ్యత, పరిశుభ్రత సమస్యలపై లేఖ రాయగా దానికి కేంద్రమ ంత్రి స్పందిస్తూ హిందీలో సమాధానం పంపారని పేర్కొన్నారు. తనకు హిందీ అర్థం కావట్లేదని ఆంగ్లంలో సమాధానం పంపాలని కేంద్రమంత్రిని పలుమార్లు కోరినట్టు చెప్పారు. తన మాటలను పరిగణనలోకి తీసుకోకుండా మళ్లీ హిందీలోనే రైల్వే సమస్య లపై సమాధానాలను పంపినట్టు చెప్పారు. దీంతో విసిగిపోయానని అం దుకే ఈసారి ఆంగ్లంలో సమాధానం ఇవ్వాలంటూ తమిళంలో లేఖ రాశానన్నారు. ఇప్పుడైనా కేంద్రమంత్రి హిందీలో కాకుండా ఆంగ్లంలో పంపిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.