16 March, 2026 | 11:00 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ఇంటికి వచ్చేస్తానని ఏడ్చేశా

12-11-2024 12:00 AM

ప్రస్తుతం సమంత సినిమాల కంటే వెబ్ సిరీస్‌ల పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో వెబ్ సిరీస్‌లు మొదలు పెట్టిన సమంత ఆ తరువాత ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె నటించిన రెండు వెబ్ సిరీస్‌లకు రాజ్ అండ్ డీకేలే దర్శకత్వం వహించారు.

అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ తొలి రోజుల్లో షూట్‌లో బాగా ఏడ్చేశారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సమంత స్వయంగా వెల్లడించారు. “రాజ్ అండే డీకేతో పని చేయడం చాలా కష్టం. వారితో పని చేయడంతో పోలిస్తే తెలుగు, తమిళం చిత్రాల్లో పని చేయడం ప్రశాంతంగా అనిపిస్తుంది. సాధారణంగా నా సినిమాల్లో రోజు మొత్తం మీద చిత్రీకరించే సన్నివేశాలను రాజ్ అండ్ డీకే గంటలోనే చిత్రీకరించారు.

ఫ్యామిలీ మ్యాన్ 2లో నా పాత్ర అయిన రాజీకి సంబంధించిన సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లను మొదటి షెడ్యూల్‌లోనే పూర్తి చేశారు. రెండు రోజుల తర్వాత మా మేనేజర్‌కి ఫోన చేసి నా వల్ల కావడం లేదని ఇంటికి వచ్చేస్తానని ఏడుస్తూ చెప్పాను. ఆ తరువాత కొద్ది రోజులకు వారి వర్కింగ్ స్టుల్‌కు అలవాటు పడ్డాను. ‘సిటాడెల్’ కోసం మరోసారి ఈ టీమ్‌తో కలిసి పని చేయడం నాకు నచ్చింది” అని సమంత తెలిపారు. ఈ నెల 7న సిటాడెల్ విడుదలైంది.