1 July, 2026 | 11:21 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

నేను బొల్లంపల్లి సంతోష్ గౌడ్ పై దాడి చేయించలేదు

08-06-2025 05:19 PM

ఈ దాడితో నాకు సంబంధం లేదు..

ముత్తారం మాజీ జెడ్పీటీసీ చొప్పరి సదానందం..

ముత్తారం (విజయక్రాంతి): నేను బొల్లంపల్లి సంతోష్ గౌడ్ పై దాడి చేయించలేదని, అసలు ఈ దాడితో నాకు సంబంధం లేదని ముత్తారం మాజీ జెడ్పీటీసీ చొప్పరి సదానందం(farmer ZPTC Choppari Sadanandam) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం రాత్రి మంథని చౌరస్తా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బొల్లంపల్లి సంతోష్ గౌడ్ అనే యువకునిపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిస్తే, ఆ దాడి నేనే చేయించానని సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారని, ఈ దాడిలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవసరమైతే నిజాన్ని నిరూపించుకోవడానికి నా ఇష్ట దైవం పెద్దమ్మ తల్లి గుళ్లో ప్రమాణం చేస్తానని, దేనికైనా సిద్ధంగా ఉన్నానని, త్వరలోనే నిజ నిజాలు బయటికి వస్తాయని, పోలీసులు అదే పనిలో విచారణ చేస్తున్నారని సదానందం తెలిపారు.