1 July, 2026 | 10:17 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

వివాదాస్పదమైన ప్రైవేట్ పాఠశాల ప్రారంభం

08-06-2025 05:14 PM

గిరిజనుల నిరసన..

వెనక్కి తిరిగిన ఎమ్మెల్యే.. 

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. అన్ని హంగులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆదివారం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించారు. పాఠశాల భవనాన్ని ప్రారంభించడానికి ఎమ్మెల్యే కారులో వస్తుండగా పెద్ద ఎత్తున గిరిజనులు అడ్డుతగిలారు.

రహదారిపై బైఠాయించి తమ స్థలం కబ్జా చేసి పాఠశాలను నిర్మించారని ఆరోపిస్తూ నినాదాలు చేస్తూ, ఎమ్మెల్యే తమకు న్యాయం చేయాలని, అటువంటి పాఠశాలను ప్రారంభించడం వల్ల ఈ ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. దీనితో ఎమ్మెల్యే పాఠశాలను ప్రారంభించకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. పాఠశాల నిర్మాణ వివాద అంశాన్ని అధికారులు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.