ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి
ప్రధానోపాధ్యాయురాలు వెంకట రామ నర్సమ్మ..
తుంగతుర్తి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వెంపటి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరు వెంకట రామ నరసమ్మ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని వెంపటి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం(Professor Jayashankar Badi Bata Program)లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వెంపటి ప్రాథమిక పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఒక ప్రక్క చదువు, మరొక ప్రక్క క్రీడలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో రాణిస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల చేర్పించి, బలోపేతం చేయవలసిన బాధ్యత ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మల్లెపాక రవీందర్, ఎల్లయ్య, శిరీష పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.






