1 July, 2026 | 8:53 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

సంతృప్తిపరచాల్సిన అవసరం నాకు లేదు

31-07-2024 12:05 AM

స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారటమే కాదు వివాదాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తోంది తాప్సీ పన్ను. ఇటీవల ఫొటోగ్రాఫర్లు గట్టిగా పేరు పెట్టి పిలుస్తూ తన కారును వెంబడించినందుకు ఈ చిన్నది చిరాకు పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానంతో అనన్య ద్వివేది అనే ఓ యువతి సెల్ఫీ అడిగిన సందర్భంలో తాప్సీ ఆమెతో ప్రవర్తించిన తీరుపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా, తన రాబోయే చిత్రం ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా’ ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటోంది తాప్సీ.

ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ కెమెరా మెన్ల తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘వారి (ఫొటో, వీడియోగ్రాఫర్లు) అభ్యర్థనను నెరవేర్చటం నేను బాధ్యతగా భావించను. నన్ను ఫొటోలు, వీడియోలు తీసుకోవటంతోనే ఆగకుండా క్లిక్‌బైట్ వన్ అంటూ నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటివే నాకు సినిమా అవకాశాలు తీసుకొస్తున్నాయని నేను నమ్మటం లేదు. కాబట్టి మీడియా అని పిలువబడే ఒక వర్గాన్ని నేను సంతృప్తిపరచాల్సిన అవసరం లేదు” అంటూ తడబడకుండా చెప్పేసింది తాప్సీ.